టీవీల్లో అదరగొట్టి.. థియేటర్లలో నిరాశపర్చిన సినిమాలు ఇవే!

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతూ ఉంటాయి.
కానీ వాటిలో కొన్ని చిత్రాలు నిరాశ పరుస్తాయి. అలాంటి ప్లాప్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌తో తెరకెక్కిన ‘ఖలేజా’ చిత్రంలో హీరో మహేష్ బాబుని దేవుడిని చేసే కాన్సెప్ట్ కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే, మరికొందరు నెగటివ్‌గా తీసుకుని ప్లాప్ అన్నారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రాఖీ’ చిత్రం. చెల్లికి జరిగిన అన్యాయంపై ఓ యువకుడు జరిపిన పోరాటమే ఈ మూవీ కథ. NTR పండించిన ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయినా ఎక్కడో తేడా కొట్టేసింది.
లాజికల్ అండ్ క్రియేటివిటీతో సుకుమార్ ‘నేనొక్కడినే’ మూవీని తెరకెక్కించారు. ఎవరికీ అర్థంకాక ఈ సినిమా కూడా ప్లాప్‌గా మిగిలిపోయింది.
నిజాలు చెప్పి ప్రేమించడం, ఎక్కువ కాలం ప్రేమ ఉండదు అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఆరెంజ్’ చిత్రాన్ని చాలా మంది బాగాలేదనే అన్నారు.