నేటి యువత తినేది మొత్తం రసాయనిక ఎరువులు కలిసిన ఆహారమే.. దాని వల్ల అనారోగ్యంతోపాటు మనిషి శక్తి, సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి.
ముఖ్యంగా సంసార జీవితానికి అవసరమైన శృంగార సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అర గంట చేయాల్సిన సెక్స్‌ని అర నిమిషంలో ముగించేస్తున్నారు.
ఈ శృంగార సమస్యల నుంచి బయట పడేందుకు, లైంగిక సామర్థ్యంతో పాటు, ఎనర్జీనిచ్చే పవర్ ఫుల్ ఫుడ్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం
అవకాడో: అవకాడో ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. అంతేకాక లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.
వెల్లుల్లి: వెల్లుల్లి సెక్స్యువల్ ఆర్గాన్స్‌కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా చేస్తుంది.
పుచ్చకాయ: పుచ్చకాయను సెక్స్ బూస్టర్ అంటారు. సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్తప్రసరణను అందిస్తుంది. ఎర్రగా ఉండే వాటర్ మెలోన్ లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్‌లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6, విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.
గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్‌లో జింక్, ఐరన్, అధిక విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.
నట్స్: నట్స్‌లో కావల్సినన్ని ఎసెన్సియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. దాంతో సెక్స్ లైఫ్ సుఖవంతం అవుతుంది.
అరటి: అరటి పండులో ఉండే పొటాషియం, విటమిన్ బి6 హార్మోనుల అసమతుల్యతను క్రమబద్దం చేయడానికి, శరీరానికి కావల్సిన ఎనర్జీ, లైంగిక జీవితం పెరగడానికి ఉపయోగపడుతుంది.
దానిమ్మ : దానిమ్మలో అనేక పోషకాలతో పాటు పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫీరాడికల్స్‌ను తొలగించడంతో పాటు, శరీరంలో రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుంది.
ఆయిల్ ఫిష్: ఆయిల్ ఫిష్‌లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎసెన్సియల్ ఆయిల్ మగవారి సెక్స్ లైఫ్‌కు బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.
స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్‌లో విటిమన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్‌కు అద్భుతంగా సహాయపడుతాయి.