సినిమాల్లో ప్రేమించి, పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో హీరోయిన్లు వాళ్ల సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారుఉన్నారు. వారెవరో చూద్దాం..

రమ్య కృష్ణ-కృష్ణవంశీ : వీరిద్దరి వివాహం 2003లో జరిగింది. కృష్ణవంశీ రమ్యకృష్ణని ప్రేమించిన ఏడేళ్ల అనంతరం వివాహం చేసుకున్నారు. రమ్యకృష్ణ ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్ర రంగంలో ప్రవేశించింది.
సుహాసిని-మణి రత్నం : సుహాసిని దక్షిణ భారత నటి. సుహాసిని, దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఖుష్బు-సి.సుందర్ : ఖుష్బు హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నటి ఖుష్బు. ఖుష్భూ సైతం డైరెక్టర్ సి.సుందర్‌ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 2000వ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది.
రోజా -సెల్వమణి : రోజా సెల్వమణి దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి, రాజకీయవేత్త. ఈమె సెల్వమణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2002లో వీరి వివాహం జరిగింది.
ప్రీత-విజయ్ కుమార్ : ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రీత తమిళ డైరెక్టర్ హరిని పెళ్లి చేసుకున్నారు. భరణి, సింగం, వంటి సినిమాలతో హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్నాడు.
నయనతార-విఘ్నేష్​ శివన్ : నయన తార కేరళకు చెందిన దక్షిణ భారతీయ సినిమా నటీమణి. నయనతార-విఘ్నేష్​ శివన్ పెళ్లి చేసుకున్నారు