సినీ ప్రపంచంలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు చాలా కామన్..
ఇండస్ట్రీలో కొంత మంది ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు కాకుండానే తల్లులు అయ్యారు.
సారిక: పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించారు నటి సారిక. ఆమెకు పుట్టిన బిడ్డ మరెవరో కాదు హీరోయిన్ శృతి హాసన్.
శ్రీదేవి: అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీదేవి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్లు.. వివాహం అనంతరం జాన్వీ పుట్టినట్లు సమాచారం.
ఇలియానా: గోవా బ్యూటీ ఇలియానా కొన్నాళ్ల క్రిత్రం ప్రేమ పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.
అలియా భట్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలాయా భట్ రన్బీర్ కపూర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. పెళ్లికి ముందే తల్లినయ్యా అంటూ చెప్పుకొచ్చింది.