ఆలుగడ్డ తొక్కలు పనికిరావని పారేస్తున్నారా.. వాటితో ఎన్ని ప్రయోజనాలో?

ఆలు గడ్డలకు కూరగా వండుకుని, లేదా చిప్స్‌గా చేసుకుని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే కొంత మంది తొక్కలను తీసి పడేస్తుంటారు.
కానీ, తొక్కలతో కూడా మన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగాళాదుంప తొక్కల్లో ఇనుము, ఎర్ర రక్త కణాల పనితీరు మెరుగుపడటానికి ఎంతో సహాయపడుతుంది.
ఆలు తొక్కల్లో విటమిన్ బి3, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పోరాడుతాయి.
వీటిలో ఉండే పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది. అలాగే గుండెపోటు రాకుండా చేస్తుంది.
పొట్టులో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
బంగాళాదుంప తొక్కల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.