బర్గర్‌లో ఉపయోగించే లెట్యూస్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని వైద్యులు ఎక్కువగా ఆకుకూరలు తినాలని చెబుతుంటారు.
ముఖ్యంగా లెట్యూస్‌ ఎన్నో పోషకాలను కలిగిఉండటం వల్ల చాలా ప్రయేజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
దీనిని ఎక్కువగా అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఓ వైద్యంలో భాగంగా ఉపయోగిస్తారట.
మన దేశంలో సూప్‌లు, శాండ్‌విచ్‌ల, బర్గర్ల తయారీలో ఎక్కువగా లెట్యూస్‌ను వినియోగిస్తుంటారు. ఇందులో ఉండే కార్బ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
ఇందులో ఉండే నీటి శాతం శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది.
ప్రోటీన్లు, లిపోక్సిజనెస్ వంటివి శరీరానికి అందుతాయి కాబట్టి మంటను తగ్గించడంలో సహాయ పడతాయి.
దీనిని తినడం వల్ల వాపు ఎముకలలో నొప్పి వంటివి తగ్గి మంచి ఉపశమనం లభించడంతో పాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
లెట్యూస్ ఆకుకూర మెదడులోని న్యూరాన్ సెల్ మరణాన్ని నియంత్రించడంలో సహాయ పడుతుంది.
ఏవైనా కంటి సమస్యలు ఉన్నవారికి లెట్యూస్ తినడం చాలా ఉపయోగకరం. దీనిని అప్పుడప్పుడు తినడం వల్ల మంచి లాభాలున్నాయి.