లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే.. దూరం ఉండకపోతే ఇక అంతే సంగతులు!
ప్రస్తుతం దాంపత్య జీవితంలో కొన్ని విషయాలు కలతలకు దారి తీస్తున్నాయి. దీంతో జంటల మధ్య ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. దీంతో చాలా మంది భాగస్వామితో ఎంజాయ్ చేయలేకపోతున్నారు.
అయితే ముఖ్యంగా కొన్ని ఆహార అలవాట్లు లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తే మరికొన్ని మాత్రం దాన్ని పూర్తి దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేనినైనా ఎక్కువగా తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రాత్రిళ్లు లేటుగా తింటే శక్తి తగ్గడంతో పాటు లైంగిక సామర్థ్యం పై ప్రభావం పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇప్పుడు ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో తమ ఆఫీసు పనులను బెడ్‌పైనుంచే చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల దాంపత్య జీవితంలోనూ పలు ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇప్పుడున్న టెన్షన్స్ వల్ల చాలా వరకు కొంత మందికి నిద్ర పట్టదు. ఈ సమస్య వల్ల హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోవడంతో లైంగిక ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
అందరూ సోషల్ మీడియాను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అసలు తిండి లేకపోయినా బతకగలరు కానీ, ఫోన్ లేకుండా ఉండలేరు. అలా చేస్తే లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతింటుంది.
వ్యాయామం మంచిదే అయినా దాంపత్య జీవితాన్ని పాడు చేస్తుందట. దాని వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది.
అలాగే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల కూడా పలు అనారోగ్య సమస్యలతో పాటు దాంపత్య జీవితంపై దాని ప్రభావం ఉంటుందట.
చాలా మందికి లేవగానే కాఫీ తాగకపోతే పూట గడవదు. రోజుకు చాలాసార్లు సేవిస్తుంటారు. అలా చేయడం కంటే మితంగా తీసుకోవడం దాంపత్య జీవితానికి మంచిది.
ఇంట్లో చేసిన వంట నచ్చకనో లేదా బయట తినాలన్నా కోరికతోనో ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్‌ను తినేస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు.