పీవీ. సింధు: పూసర్ల వెంకట సింధు ఈమె పూర్తి పేరు. ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి. వరుసగా రెండు ఒలంపిక్స్‌లలో పతకాలు గెలుచుకున్న వీరనారి.
వీవీఎస్ లక్ష్మణ్-వంగిపురపు వెంకటసాయి లక్ష్మణ్. ఇండియన్ మాజీ క్రికెటర్ అయిన ఇతడిని మణికట్టు మాంత్రికుడు అని పిలుస్తారు.
పి. టి. ఉష-పిలవుల్లకండి తెక్కపరంబిల్ ఉష. పరుగుల రాణి అయినా ఈమె స్వీయ జీవిత చరిత్రలో ‘గోల్డెన్ గర్ల్’ గా పేరు దక్కించుకుంది.
పి. ఆర్. శ్రీజేష్- పరట్టు రవీంద్రన్ శ్రీజేష్ అనే ఈయన ఇండియన్ హాకీ జట్టు గోల్ కీపర్ 2020 టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడు.
మేరీ కోమ్- మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్ ఓలి ఈమె పూర్తి పేరు. భారత ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణ. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను వరుసగా 6 సార్లు గెలుచుకున్న ఏకైక బాక్సర్.
విజేందర్ సింగ్- విజేందర్ సింగ్ బెనివాల్ ఈయన పూర్తి పేరు. హర్యాణా భారత ఫ్రొపెషనల్ బాక్సర్. 2008 బీజింగ్ ఒలంపిక్సక్‌లో కాంస్య పతకాన్ని సాధించిన మొదటి భారతీయ బాక్సర్ ఇతడే.