ఏదైనా పండు తిన్నా, లేక జ్యూస్ తాగినా మన చర్మానికి మంచి నిగారింపు వస్తుందనే విషయం తెలిసిందే. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కేవలం వాటితో ఫేస్ ప్యాక్స్ వేసుకునేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అయితే అలా కాకుండా వాటిని తింటేనే అధిక ప్రయోజనం ఉంటుందంటున్న నిపుణులు.. ఏయే పండ్లు తీసుకోవాలో సూచిస్తున్నారు.
1. అరటి పండ్లు : అరటి పండులో ఉండే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి చర్మ నిగారింపుకు ఉపయోగపడతాయి.ఇందులోని ఎ, బి, ఈ విటమిన్స్ చర్మం మంచి రంగులోకి మారడానికి సహాయపడతాయి. చర్మంలో సహజమైన నూనెలను పునరుద్ధరించి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.
2. నిమ్మ కాయ : నిమ్మకాయ చర్మ సమస్యలు తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మంపై ఉండే ముడతలు ముఖ్యంగా మోచేతులపై నల్లటి మచ్చలను పోగొడుతుంది.
3. యాపిల్ : యాపిల్ ఫేస్ ప్యాక్‌తో చర్మానికి సొగసులు అద్దొచ్చు కానీ తినడం వంద శాతం మంచిదని అంటున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు.
4. ఆరెంజ్ : ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి చర్మానికి మెరుపునిస్తుంది. చర్మాన్ని నల్లగా మార్చే మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తూ నల్ల మచ్చల రూపాన్ని తగ్గిస్తుంది. అలాగే బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.