తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

తక్కువ బడ్జెత్‌తో వచ్చిన ఈ సినిమా.. ఓటీటీ వచ్చినప్పటికీ థియేటర్లలో సందడి చేస్తుంది
అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా
కానీ ఈసినిమాలో నాలుగు బిగ్ మిస్టేక్స్ ఉన్నాయంట. అవి
తెలంగాణలో చాలావరకు మేనత్త కూతుర్ని వివాహం చేసుకోరు. కేవలం మేనమామ బిడ్డను మాత్రమే వివాహం చేసుకుంటారు.
తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చూస్తే ఇంట్లో తండ్రి లేదా తల్లి చనిపోయిన దశదిన కర్మ రోజు కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు తప్పనిసరిగా గుండు గీయించుకుంటారు.ఈ చిత్రంలో అది లేదు.
కాకి ముట్టకపోతే ఊర్లో వారికి మంచి జరగదనేది, ఊర్లో నుంచి వెలివేస్తారనేది తెలంగాణ సాంప్రదాయంలో ఇప్పటి వరకు చూడలేదు.
కాకి ముట్టకపోతే కుక్కను, లేదంటే బర్రె ఆవు లాంటి జంతువులతో పిండాలను తినిపిస్తారు.