గతంలో ఎక్కువగా వృద్ధులకు మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ, ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే గుండె పోటు రాకుండా ఉండేందుకు ఈ ఫుడ్స్ తిని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
మెగ్నీషియం అధికంగా ఉండే ఆకుకూరలు, ధాన్యాలు తీసుకోవడం వల్ల గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు.
ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్న వేరుశనగ, గుమ్మడి గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు తినడం మంచిది.
శరీరానికి ప్రోటీన్లను కలిగించే గుడ్లు, మాంసం వంటివి తినడం వల్ల పోషకాహారాలు అంది మీ గుండె పనితీరును మెరుగు పడి హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది.