డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!

ప్రస్తుతం చాలా మందికి డెంగ్యూ వ్యాపించి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏ చిన్న దోమ కుట్టినా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.
ప్లేట్‌లెట్ స్థాయిలు పడిపోవడానికి, రక్త నాళాలను దెబ్బతీయడానికి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
డెంగ్యూ సమయంలో ఆహారంలో భాగంగా ఉండవలసిన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ సి ఒకటి. నారింజ, నిమ్మ, బొప్పాయి, జామ మొదలైనవి వాటితోపాటుగా ఆకుకూరలు, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలు తీసుకోవాలి. అలాగే, తాజా బొప్పాయి ఆకు రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపరచడం ద్వారా డెంగ్యూ చికిత్సలో సహాయపడుతుంది.
అలాగే బీన్స్, చిక్కుళ్లు, ఆకుకూరలు , ఖర్జూరం వంటి రిచ్ ఫుడ్స్ ఐరన్ ను పెంచడంలో తోడ్పడతాయి. ఇవి ప్లేట్‌లెట్స్ త్వరగా రికవరీ కావటానికి సహాయపడతాయి.
విటమిన్ K రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించటంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
క్యాలరీలు కలిగినవి తినాలి. పాలు, డ్రై ఫ్రూట్స్, బంగాళదుప్ప వంటివి తీసుకోవాలి.
డెంగ్యూ నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటున్న సమయంలో కొబ్బరి నీళ్లు, గంజి, సూప్ వంటివి తాగితే మంచిది. పొటాషియం, కాల్షియం, సోడియం మెగ్నీషియం వంటి వాటితో నిండి ఉంటాయి.