జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఇవే.. తిన్నారో అంతే సంగతి?
ప్రస్తుతం అందరికీ సీజనల్ వ్యాధులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందికి స్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అయితే జ్వరం వచ్చినప్పుడు ఏది పడితే అది తినకూడదు. ఆహారం తీసుకునే విషయంలో పలు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ పదార్థాలు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
తృణధాన్యాలతో చేసిన టిఫిన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దాని వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.
ముఖ్యంగా పొట్టుతో ఉన్న పప్పులతో చేసిన వంటలు తీసుకోవడం మంచిది కాదు. ముల్లంగి, క్యాప్సికమ్ కూడా తినకూడదు.
క్యాబేజీ, ఉల్లిపాయలు వెల్లుల్లి జ్వరం వచ్చినప్పుడు తినడం అంత మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
చాలా మందికి సాయంత్రం పూట బయటకు వెళ్లి పకోడి, లడ్డూలు, సమోసాలు వంటివి తినే అలవాటు ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు అలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
మసాలాలు అధికంగా ఉపయోగించి చేసిన వంటకాలు, మామిడికాయ చట్నీ వంటివి తీసుకోకుండా ఉండడం బెటర్.
అలాగే జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ గోరువెచ్చని నీరు తాగుతూ ఉండాలి.