థైరాయిడ్ సమస్యను నియంత్రించాలంటే బెస్ట్ ఆహారాలు ఇవే!
జీవన శైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుత రోజుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిలో థైరాయిడ్ సమస్య ఒకటి.
థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టి.. గ్రంధి పనితీరును మెరుగుపర్చుకోవాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి, దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. దీనిని నేరుగా తినలేం కాబట్టి ఉడకబెట్టి లేదా పచ్చడి చేసుకుని తింటే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది.
మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలు ఈ వ్యాధి నుంచి ఈజీగా బయటపడేస్తాయి.
రోజుకు 3 బ్రెజిలియన్ బీటెల్ నట్స్ తీసుకుంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.
ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరాయిడ్‌లు సమృద్ధిగా ఉండే పచ్చి కొబ్బరి నూనె థైరాయిడ్ రోగులకు మంచి ఆహారం.
అలాగే పెసరలు ఈ వ్యాధితో బాధపడుతోన్న వారికి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.