ఆ 5 కారణాల వల్లే పెళ్లైన మగవారు పరాయి స్త్రీని ఇష్టపడతారు..
పెళ్లైన కొన్నాళ్లకే చాలా మంది వేరే మహిళలను ఇష్టపడతారు. వారితో శారీరక సంబంధం పెట్టుకునేందుకు ఇష్టపడతారు.
అయితే.. దీని వెనుక కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..? దీనిపై చాణక్య నీతి ఏం చెబుతుందంటే..!
స్త్రీలు, పురుషులు ఒకరినొకరు ఆకర్షించబడతారు. అది సాధారణం. కానీ ఆ ఆకర్షణ తప్పుగా మారి అక్రమ సంబంధానికి దారి తీస్తే వైవాహిక జీవితం నాశనమయ్యే ఛాన్స్ ఉందని చాణక్య నీతి చెబుతుంది.
ఒక వ్యక్తి తన బాధ్యతలను పూర్తి చేసుకుని మంచి జీవితాన్ని అనుభవించే సమయంలోనే కోర్కెలపై మనసు మల్లుతుంది. అలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలు పెరిగే అవకాశం ఉంటుంది.
భార్యాభర్తల సంబంధంలో శారీరక సంబంధం కూడా చాలా ముఖ్యం. అది లేకపోతే ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి.. వివాహేతర సంబంధాలపై మొగ్గు పెరుగుతుంది.
భార్యాభర్తల సంబంధంలో నమ్మకం లేకపోయినా.. నిత్యం ఏదో ఒక వివాదం జరగడంతో వైవాహిక జీవితంలో భాగస్వామి మనసు కలత చెంది అక్రమ సంబంధాలపై అడుగులు పడతాయి.
పెళ్లి అయినప్పటి ప్రేమకు, ఓ బిడ్డ పుట్టిన తర్వాత పురుషులు, లేక స్త్రీలు భాగస్వామిపై చూపించే ప్రేమకు వ్యత్యాసం ఉంటుంది. భార్య లేక భర్త పుట్టిన బిడ్డపై ప్రేమ చూపిస్తూ బాగస్వామిని పట్టించుకోకపోవడంతో కూడా అక్రమ సంబంధాలు ఏర్పడతాయి.
కాబట్టి.. భర్తకు భార్య, భార్యకు భర్త కాస్త సమయాన్ని కేటాయించి ఒకరినొకరు చూసుకున్నట్లయితే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రేమ బలపడి బలమైన బంధంగా మారుతుంది.