డెంగ్యూ, మలేరియా త్వరగా తగ్గాలంటే ఈ అదిరిపోయే టిప్స్ మీ కోసం!
మలేరియా అండ్ డెంగ్యూ ఈ రెండు వ్యాధులు ఇండియాలో భయంకరమైనవే.
ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మానవులకు వ్యాపించినప్పుడు అనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. అయితే డెంగ్యూ అనేది సోకిన ఏడిస్ దోమ ఎవరినైనా కుట్టినప్పుడు వచ్చే వైరల్ వ్యాధే డెంగ్యూ. అయితే ఈ వ్యాధుల నివారణ చిట్కాలు ఓసారి చూద్దాం..
యాంటీ మైక్రోబయల్ పుష్కలంగా కలిగి ఉండే తులసి ఆకులు సర్వరోగాలను మటుమాయం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు తాజా తులసి ఆకులను నమిలి తినండి డెంగ్యూ, మలేరియా తగ్గడమే కాకుండా ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది.
డెంగ్యూ ఫీవర్ వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తగ్గుతుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెంచే సామర్థ్యం కేవలం బొప్పాయి ఆకు రసానికే ఉంది. అలాగే కొబ్బరి నీరును తీసుకోవడం కూడా ఎంతో మంచిది.
యాంటీ మలేరియా, యాంటీ వైరల్ లక్షణాలు ఉండే వేపాకును డైలీ తీసుకోవడం వల్ల ఈ వ్యాధికి ఈజీగా చెక్ పెట్టొచ్చు.
మలేరియా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ద్రాక్షపండు ఎంతో మేలు చేస్తుంది.
ఆయుర్వేదంలో అధికంగా వాడే గిలోయ్ అనే ఆకు జ్వరాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ ఆకులో యాంటి పైరేటిక్ లక్షణాలు ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచే అల్లం టీ తాగడం వల్ల మలేరియా, డెంగ్యూ లక్షణాలు తగ్గుతాయి.
ఎచినాసియా అనేది ఇమ్యూనిటి పవర్‌ను ప్రేరేపించే మూలిక. ఈ రెండు వ్యాధులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.