గులాబీ మొక్కకు ఎక్కువగా పూలు పూయాలంటే ఈ అద్భుతమైన టిప్స్ మీ కోసం..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది మొక్కలు పెడుతుంటారు.
ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడే పూల మొక్కల్లో గులాబీ మొక్కలను ఎక్కువగా నటుతారు.
అయితే ఈ మొక్కలను పెంచేటప్పుడు కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తారు. కాగా గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగి.. ఎక్కువగా పూలు పూయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూద్దా..
మీరు గులాబీ మొక్కను కొనేటప్పుడు ఆల్రెడీ ఫ్లవర్స్ ఉంటే వాటిని తీసేయ్యండి. అప్పుడే కొమ్మలు పెరిగి, గులాబీ మొగ్గలు వస్తాయి.
మొక్కను వెలుతురు ఉన్న ప్రదేశంలో పెట్టాలి. రెగ్యూలర్‌గా ప్లేసెస్ ఛేంజ్ చేయకూడదు.
మంచి కంపోస్ట్ రిచ్ మట్టిని వాడాలి. కనీసం రెండు అడుగుల లోతులో మొక్కను నాటలి.
గులాబీ మొక్కకు రోజు తప్పకుండా నీరు పోయాలి. నీరు పోసేటప్పుడు ఆకులపై నీరు పడకుండా చూసుకోవాలి.
గులాబీ మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే మట్టితో పాటు వేప పొడి కలిపి నాటాలి. ఇలా చేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు రాలే పూలను తీసేయాలి. దీంతో కొత్త పూలు వస్తాయి.
అలాగే వేపాకులు తీసుకుని అందులో వెల్లుల్లి తొక్క వేసి మెత్తగా మిక్సీ చేసి.. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో వేసి, దీన్ని గులాబీ మొక్కకు స్ప్రే చేస్తే చీడపీడలు, కీటకాలు, చీమలు లాంటివి వదులుతాయి.