ఇంట్లో అశాంతి నెలకొందా..! ఆనందంగా జీవించాలి అనుకుంటే ఈ 5 చర్యలు పాటించండి
ఎంత డబ్బు, ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. చాలా మందికి ఇంట్లో అశాంతి నెలకొంటోంది.
తమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ప్రతీ ఒక్కరు దేవుడిని ప్రార్థిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసిన పనులే ఇంట్లో అశాంతిని నెలకోల్పుతాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆర్థిక సమస్యలు పోయి, ఇంట్లో శాంతి పొందాలంటే ఈ పనులు చేస్తే మంచిదట. అవేంటంటే..
ఆదివారం రోజున అంజీర చెట్టును పూజిస్తే మంచిదట. ఆర్థిక ఇబ్బందులు తొలగి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు పండితులు.
సూర్యోదయ సమయంలో ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు అనుగ్రహం కోసం తూర్పు ముఖంగా కూర్చుని రోజూ గాయత్రీ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించడం ద్వారా అదృష్టం కలుగుతుందట.
ప్రతి రోజూ సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి కలుగుతుంది.
రోజూ స్నానం చేసిన అనంతరం.. ఇంట్లో తూర్పు, ఉత్తరం దిక్కులు కలిసే మూల గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత పోయి.. ఆనందం ఉంటుంది.
దేవుడికి ఉపయోగించిన పువ్వులు, ఇతర వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పాడేయ్యరాదు. అలా చేస్తే అశాంతి నెలకొంటుంది. కాబట్టి.. ప్రవహించే నదిలో కానీ, లేదా గొయ్యి తీసి అందులో వెయ్యాలని పండితులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన సమాచారం పండితుల ఆధారంగా, ఇంటర్నెట్ సహాయంతో తెలిపినవి మాత్రమే. ఇవి మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయంగా దీనికి ఎటువంటి ఆధారాలు లేవు.