భారత దేశంలో ప్రవహిస్తున్న బంగారం నది.. ఇది ఇప్పటికి మిస్టరీగానే ఉంది.

మన దేశంలో ప్రవహించే నదులలో స్వర్ణరేఖ నది కూడా ఒకటి.
ఈ నదిని " గోల్డెన్‌ రివర్‌ " అని కూడా పిలుస్తారు.
ఈ నది బంగారంతో ప్రవహిస్తుందని మనలో చాలా మందికి తెలియదు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇది నిజం.
అక్కడ నివసించే ప్రజలు బంగారం కోసం వెళ్తుంటారు. అయితే, బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది.
జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో ఈ గోల్డెన్ రివర్ ఉంది. అక్కడి ప్రజలకు ఇదే ఆదాయ వనరు.
ఈ నది జార్ఖండ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ నది రాళ్లల్లోంచి ప్రవహిస్తుందని.. అందువలన బంగారు రేణువులు కలుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ అధికారిక ధృవీకరణ లేదు.