చర్మం తాజాగా ఉండాలంటే ఫేషియల్ తర్వాత ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
ఫేషియల్ వల్ల అందం పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎక్కువ రోజులు అందంగా ఉండి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత వారం పాటు ఎలాంటి కెమికల్ పీల్స్ జోలికి వెళ్లకపోవడం బెటర్. దీని వల్ల చర్మం నల్లబడి, ముఖంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
ఫేషియల్ తర్వాత ఎండలో, చెమట ఎక్కువగా వచ్చే చోట ఉండకపోవడం మంచిది.
ఫేషియల్ తర్వాత వ్యాక్సింగ్ వద్దు. ఫేషియల్ చేయించుకోవడానికి కనీసం 2,3 రోజుల ముందే వ్యాక్సింగ్, ప్లకింగ్ లాంటివి చేసుకోవాలి.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత తరచూ ముఖాన్ని ముట్టుకుంటే బ్యాక్టీరియా చేరి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖం కడుక్కున్నాక కూడా టవెల్తో గట్టిగా రుద్దకుండా సున్నితంగా అద్దాలి.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత కూడా చర్మం తాజాగా కనిపించాలంటే సరిపడా నీరు తాగాలి. ఒకవేళ ముఖంపై దద్దుర్లు, దురద సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరు సలహా పాటించాలి.
ఫేషియల్ తరువాత చర్మం కాస్త పొడిబారినట్లు అవుతుంది. అందుకే తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రసాయనాలు లేని, మీ చర్మానికి తగ్గ మాయిశ్చరైజర్ ను ఉపయోగిస్తే మంచిది.
సాధారణంగా సున్నిత చర్మం మీద యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ. ఫేషియల్ తర్వాత సన్స్టీన్ లోషన్ను బ్యూటీషియన్ సలహా మేరకు వాడండి. ఇది చర్మం రంగు మారకుండా, ర్యాషెస్ రాకుండా చేస్తుంది.