Home Loan పై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి!

ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బులు లేనప్పుడు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారు.
మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు అర్హతను బట్టి లోన్లు జారీ చేస్తుంటాయి.
ఈ లోన్ అమౌంట్‌పై వడ్డీ రేటు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటుంది.
అయితే ఏ బ్యాంకులో హోం లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హోం లోన్ వడ్డీ రేట్లు 8.45 శాతం నుంచి 9.85 శాతంగా ఉంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 8.75 శాతం నుంచి 10.5 శాతం.
ఐడీబీఐ బ్యాంకులో 8.75 శాతం నుంచి 10.75 శాతం ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేట్లు 8.8 శాతం నుంచి 9.45 శాతం వరకు ఉన్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంకులో 8.85- 9.35 శాతం వరకు వడ్డీ అమల్లో ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 8.5 -10.50 శాతం వరకు ఉంది.