గర్భంలో కవల పిల్లలు ఉన్నారని తెలిపే సంకేతాలివే!

చాలా మంది మహిళలు అమ్మతనం ఎంతో గొప్ప అనుభూతి. అలాంటిది ప్రెగ్నెంట్ అని తెలియగానే చాలా మంది ఒకేసారి కవలలు పుట్టాలని కోరుకుంటారు.
ఇది అరుదు కొంత మందికే అలా కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. అయితే గర్భంలో ట్విన్స్ ఉన్నారని డెలివరీకి ముందే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చునట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పిండంలో ఒకరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే HCG లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో గోనడోట్రోఫిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందట.
అలాగే ప్రెగ్నెంట్ అయిన మొదటి వారంలో రక్త పరీక్ష ద్వారా దీనిని గుర్తించవచ్చు. అలాగే పలు రకాల హార్మోన్ల మార్పులు జరుగుతాయి.
గర్భంలో కవలలు ఉంటే వాంతులు, విపరీతమైన అలసట తరచుగా మూత్ర విసర్జన, ఆకలి పెరగడం, మానసిక సమస్యలు కనిపిస్తాయట.
ఒకవేళ గర్భంలో ఆడపిల్లలు ఉంటే పొట్ట పరిమాణం పెరుగుతుంది. బరువు కూడా అమాంతం అధికమవుతుంది.
ముఖ్యంగా గర్భిణీలు ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర, తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల సుఖవంతమైన డెలివరీ అవుతుంది.
అయితే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి అందరికీ లక్షణాలు ఉండకపోవచ్చు. ఏదేమైనా కూడా ప్రెగ్నెంట్ ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సలహాలు, సూచనలు పాటించాలి.