వంటింటి గృహిణులకు సూపర్ న్యూస్.. ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ హ్యాపీ!

వంటింటి గృహిణులు అనేక రకాల వంటలు చేస్తారు కానీ.. వారికి తెలియని సులభమైన చిట్కాలు ఎన్నో ఉంటాయి.
ఆ చిట్కాలను పాటిస్తే మీరు ఈజీగా వంట తయారు చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు.
కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి.
బ్రెడ్ ప్యాకెట్‌లో బంగాళదుంప ముక్కలు ఉంచితే తొందరగా పాడవ్వకుండా ఉంటుంది.
చేపలు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించే ముందు వెనిగర్‌తో కడిగాలి.
పూరీలు రుచిగా కరకరలాడాలంటే కాస్త వాము సెనగ పిండి, బ్రెడ్ పొడి కలుపుకోవాలి.
పాల మీగడ చక్కగా రావాలంటే పాలు కాసే ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.
యాపిల్ ముక్కలను కట్ చేశాక రంగు మారకుండా ఉండాలంటే చాక్‌కు కొద్దిగా నిమ్మరసం రాసి తరువాత యాపిల్‌ను కోయాలి.
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కాస్త బియ్యం పిండి కలిపితే రుచిగా ఉంటుంది.