సమ్మర్ ఎఫెక్ట్: ఐస్ క్రీమ్ అతిగా తింటున్నారా..?

ఎండల దెబ్బకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జనాలు భయపడిపోతున్నారు.
అయితే ఎండ తాపాన్ని తట్టుకునేందుకు చల్ల చల్లగా ఏదైనా తినాలనుకుని చాలా మంది ఐస్ క్రీమ్‌ను లాగించేస్తుంటారు. అధికంగా ఐస్ క్రీమ్‌ను తింటే ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.
ఐస్ క్రీమ్‌లో చక్కెర, కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉండి బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఎక్కువగా తినకపోవడం మంచిది.
ఇందులో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయి గుండె పోటుకు దారితీస్తాయి.
అలాగే మధుమేహం ఉన్నవారు ఐస్ క్రీమ్ జోలికి పోకపోవడం చాలా మంచిది. లేదంటే షుగర్ లెవల్స్ తీవ్రం అవుతాయి.
చల్లగా రుచిగా ఉందని అధికంగా తిన్నారంటే మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఐస్ క్రీమ్‌లను అతిగా తీసుకుంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు పెరిగి ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త.
వీటిల్లో ఉండే పదార్థాల వల్ల చల్లగా తినడం వల్ల కావొచ్చు మెదడుపై ప్రభావం పడి మెమోరీ పవర్‌ను తగ్గిపోతుంది.
ఐస్ తినడం వల్ల శక్తి రాకుండా నీరసం వస్తుంది. దీనిని రాత్రి సమయంలో తింటే జీర్ణం కాకపోవడం వల్ల నిద్ర పట్టదు.