సోషల్ మీడియాకు దూరంగా ఉంటే జరిగే పరిణామాలివే?

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నిత్యం ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు.
దీనిని ఎక్కువగా వాడటం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు.
అయితే బ్రిటన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ బాత్’ కు సంబంధించిన వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఏమవుతుందనే దానిపై అధ్యయనం నిర్వహించారు.
వారం రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మానసిక సమస్యలు తగ్గుతాయని తేలింది.
అలాగే డిప్రెషన్‌, కోపం వంటివి తగ్గి సంతోషంగా గడుపుతారట.
ఒక వారం పాటు ఫోన్, సోషల్ మీడియాకు దూరం అయితే మానవుల్లో ఎన్నో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొంత మంది ఫోన్‌తో వచ్చే సమస్యల వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఫోన్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.