Smartphone నీళ్లలో పడిందా.. అయితే ఈ చిట్కాలు మీకోసం

ప్రస్తుతం ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయి.
చేతిలో ఫోన్ లేకపోతే బాడీలో ఓ పార్ట్ మిస్ అయినట్లుగా ఫీల్ అవుతూ.. ఎక్కడికి వెళ్లిన వెంట తీసుకుని వెళుతున్నారు.
ఇక ఒక్కోసారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిసిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
అయితే ఫోన్ నీళ్లల్లో పడిపోయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ మొబైల్ సురక్షితంగా ఉంటుంది. అవి ఏంటంటే..
నీళ్లలో పడిపోయిన ఫోన్ ముందుగా పొడి కాటన్ క్లాత్‌తో తుడుచుకోవాలి
అనంతరం ఆ ఫోన్‌ను కొంత సమయం వరకు.. అంటే ఇంచుమించుగా 12 గంటలు ఉపయోగించకూడదు.
అలాగే బియ్యంలో కనీసం 6 నుంచి 7 గంటల వరకు ఉంచినట్లయితే తొందరగా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే.. బియ్యం గింజలు ఫోన్ లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.