ప్రతిరోజూ అల్పాహారంలో గుడ్లు తింటే మంచిది అంటారు వైద్యులు..

రోజుకు 3 నుంచి 4 వరకు గుడ్లు ఉడకపెట్టుకుని తినే వాళ్లు ఉంటారు.
కానీ, రోజు ఎక్కువ మొత్తంలో ఎగ్స్ తినడం శరీరానికి అస్సలు మంచిది కాదు.
గుడ్లను పరిమితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. అదే ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
దీంతో కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్, అజీర్ణం, గ్యాస్, మొటిమల వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అతిగా గుడ్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి భవిష్యత్తులో హార్ట్ డిసీజ్‌కు కారణం కావచ్చు.
కాబట్టి రోజుకు రెండు కంటే ఎక్కువ ఎగ్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు