డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయని చాలా మంది ఎక్కువగా తింటుంటారు.
అయితే వీటిని తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు డ్రైఫ్రూట్స్ మోతాదుకు మించి తింటే చాలా ప్రమాదం.
అలాగే గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మలబద్ధకం, విరోచనాల బారిన పడకూడదంటే డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.
ఇవి జీర్ణ వ్యవస్థను బలహీన పరుస్తాయి. దీంతో పాటు బరువు పెరుగుతారు.
డ్రై ఫ్రూట్స్ నిత్యం తీసుకోకుండా 3 నెలల తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ తీసుకోవాలి.