చనిపోయిన వ్యక్తి వస్తువులు మళ్లీ మనం వాడకూడదా..?

కుటుంబంలోని వ్యక్తి దూరంగా ఉంటేనే భరించలేం. కానీ ఆ మనిషే చనిపోతే తట్టుకోవడం కష్టం. వారి ప్రేమకు మనం పూర్తిగా దూరం అయినట్టే.
అయితే ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా చనిపోయాక శవమే అవుతుంది. మృత్యువు అనేది అశుభమే. అందుకే చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులను అసలు వాడకూడదట.
పురాణాలు, పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి వస్తువులు ఎంత ఖరీదైనవి అయినా వాడుకూడదంట. వాటిని వాడితే అశాంతి కలుగుతుందట. ముఖ్యంగా మూడు రకాల వస్తువులను అసలు ఉపయోగించవద్దట. అవేంటో చూద్దాం.
మొదటిది : బంగారాన్ని అసలు వాడకూడదు. చనిపోయిన వ్యక్తి ఇష్టపూర్వకంగా తన మరణాంతరం ఇతరులకు ఇవ్వాలని కోరితే తప్పా.. వాటిని అలాగే వాడకూడదు. ఆ నగలను అమ్మడం, లేదా మార్పిడి చేసుకోని వాడాలి.
రెండవది : చనిపోయిన వ్యక్తి ధరించిన దుస్తులను మళ్లీ వాడకూడదు. అవి ఎంత విలువైనవి అయినా దానం చేయడం మంచిది. అసలు వారికి సంబంధించిన బట్టలను ఇంట్లోనే ఉంచకూడదు.
మూడవది : చివరగా వాచ్. చేతి గడియారాన్ని చనిపోయిన వ్యక్తి ఎల్లప్పుడు ధరించే ఉంటారు. అది వారికి ఇష్టమైన వాటిల్లో ఒకటిగా ఉంటుంది. అందుకే వాచ్ ఎంత ఖరీదైనది అయినా మళ్లీ వాడకపోవడం బెటర్
మరణానికి ముందు వాళ్లు ఎంతో ఇష్టపడి వాటిని కొనుగోలు చేసి ఉంటారు. చనిపోయాక కూడా వారికి ఆ వస్తువులపై ఇష్టంపోదట. అందుకే వారి ఆత్మలు వాటి చూట్టే తిరుగుతాయని పూర్వీకుల నమ్మకం.
ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.