భాగస్వామితో బ్రేకప్ అయ్యాక తొందరపడి ఈ తప్పులు అస్సలు చేయకూడదు?

ఇటీవల చాలా మంది జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ తమ బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నారు.
కొంతమంది పెళ్లి అయినా కానీ పెటాకులు చేసుకుని విడిపోతున్నారు. అయితే అలాంటి సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు.
భాగస్వామితో బ్రేకప్ అయ్యాక మీ మాజీలపై కోపంతో పగ తీర్చుకోవాలని ఎవేవో ప్లాన్స్ వేస్తుంటారు. మానసిక వేదనను ఇతరులపై రుద్దడం మీకే ప్రమాదం.
అలాగే విడిపోయాక బాధలో ఏది పడితే అది మాట్లాడకూడదు. వాని వల్ల కోపం పోయాక మీరు ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది.
ఒకవేల పెళ్లి అయి పిల్లలు పుట్టాక విడిపోతే పిల్లల్ని మీ గొడవలోకి లాగొద్దు. పిల్లలు లేని సమయంలో మాట్లాడుకోవాలి.
మీ భాగస్వామితో విడిపోయాక సోషల్ మీడియాలో స్టేటస్, లేదా ఇతరులకు నెగిటివ్‌గా చెప్పకూడదు.
బ్రేకప్ చెప్పుకున్నాక ఒంటరిగా అస్సలు గడపకూడదు. అందరితో కలిసి ఉంటూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.
కొంత మంది ఎక్కువగా ఆల్కహాల్‌కు బానిసలు అవుతారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి ప్రమాదంలో పడతారు.
బ్రేకప్ తర్వాత వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. ఎవర్ని నమ్మకపోవడం, ఎక్కువగా బాధపడుతూ ప్రతీ విషయంలో నిరాశతో ఉంటారు. అలా అస్సలు ఆలోచించకూడదు.
జీవితంలో ఎవ్వరూ మీతో కలకాలం ఉండరు అని పెద్దలు అంటుంటారు. కాబట్టి ఒంటరిగా సంతోషంగా జీవించడానికే ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి.