వేసవిలో ఈ మసాలా దినుసులు తినాలా? వద్దా?వంటింటి గృహిణులు తప్పక తెలుసుకోవాలి!
సమ్మర్‌లో ఎక్కువగా ఫ్రూట్స్ తినడం తింటూ.. మసాలా దినుసులకు దూరంగా ఉంటారు.
కానీ ఎండాకాలంలో మసాలా దినుసులను వాడడం వల్ల ఆరోగ్యానికీ ఎంతో మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.
జీలకర్ర గింజల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీన్ని వేడి నీటిలో నీటిలో మరగించి, గోరువెచ్చగా అయ్యాక తాగితే మలబద్ధకాన్ని వీడొచ్చు.
అలాగే కొత్తిమీర అధికంగా గార్నిషీ కోసం వాడుతారు. ఇది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది.
కొత్తిమీరతో తయారయ్యే దనియాల్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్స్, విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అలాగే పుదీనా ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో ఔషదగుణాలతో కూడుకున్న ఈ పుదీనా నీళ్లు తాగితే వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. ఈ ఆకులు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ఇక ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలను ఎండాకాలంలో అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వీలైనంత వరకు తగ్గించడం మంచిది.