నిమ్మకాయలు తింటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్లే?

నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు.
చాలా మంది దాహం వేసినప్పుడు ముందుగా నిమ్మకాయ పిండుకొని తాగుతారు.
అలాగే నిమ్మకాయ చట్నీలు కూడా పెట్టుకుంటారు. వంటకాల్లో వాడుతారు.
ముఖ్యంగా నాన్‌వెజ్ ఫుడ్‌లో నిమ్మకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే.
అయితే కొన్ని ఆహారాల్లో నిమ్మను కలుపుకోవడం వల్ల విషపూరితమయ్యే చాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తాగితే హిమోగ్లోబిన్ శాతం తగ్గి రక్తహీనత సమస్యలు వస్తాయి.
నిమ్మరసం - పాలు కలిపి తీసుకోకూడదు. దీనివల్ల నిమ్మలో ఉండే సిట్రస్ పాలు విరిగిపోయేలా చేస్తుంది. అలాగే కడుపులో ఉండేటువంటి జీర్ణారసాలతో కలిసి యాసిడ్స్‌ను కడుపులో రిలీజ్ చేసి.. ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేస్తుంది.
రాత్రి సమయంలో నిమ్మ, ఉసిరి చట్నీలు తినకూడదు. ఇవి రెండు మిక్స్ చేసుకుని తింటే మెదడులో సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు పగిలిపోయే చాన్స్ ఉంటుందట.
అలాగే పాలు-పనస పండులో నిమ్మరసం యాడ్ చేస్తే చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.