ముఖ పరిచయం లేని వాళ్లతో ఏడు రోజులు శృంగారం.. ఎంత అదృష్టమో తెలుసా..?
సాధారణంగా ప్రాంతాలను బట్టి ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు ఉంటాయి. వీటిల్లో కొన్ని విచిత్రంగా ఉండి అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి.
అలాంటిదే ఇండోనేషియాలో అపరిచితులతో శృంగారం చేసే పండుగ. దీనిని ఇప్పటికి కూడా జరుపుకోవడం విశేషం. జావా ద్వీపంలోని మౌంట్ కెముకస్లో ఉండే ఓ పర్వతానికి సెక్స్మౌంటెన్ అనే పేరు ఉంది.
దీనిపై ఉన్న దేవాలయంలో అక్కడి ప్రజలు 35 రోజుల పాటు సెక్స్‌లో పాల్గొంటారు. వాళ్ల ఆచారం ప్రకారం పరిచయం లేని వ్యక్తులతో వరుసగా 7 సార్లు శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుందట.
దీనిపై ఉన్న దేవాలయంలో అక్కడి ప్రజలు 35 రోజుల పాటు సెక్స్‌లో పాల్గొంటారు. వాళ్ల ఆచారం ప్రకారం పరిచయం లేని వ్యక్తులతో వరుసగా 7 సార్లు శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుందట.
అయితే వారిద్దరికీ ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకోవచ్చు. లేదా అంతటితో వదిలేసుకోవచ్చు. అయితే ఇలా 7 సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఐశ్వర్యంతో పాటు ఆ కుటుంబానికి మంచి జరుగుతుందని వారి పూర్వీకుల కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు.
ఈ పండుగలో పెళ్లైన వివాహితలు కూడా పాల్గొని తెలియని వారితో సెక్స్ చేయవచ్చు. ఇది అక్కడ నేరం కూడా కాదు.
దీనిని జరుపుకోవడానికి కారణం అక్కడి రాజకుమారుడు అతని సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న రాజు వారిని రాజ బహిష్కరణ చేస్తాడట.
రాజ్యం వదిలిన ఆ జంట సమీపంలోని పర్వతం మీద ఉంటూ శృంగారంలో పాల్గొన్న సమయంలో రాజ భటులు వారిని చూసి చంపి అక్కడే పాతి పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వారి ప్రేమకు గుర్తుగా ఇక్కడ ఓ ఆలయం నిర్మించి ఏడాదికోసారి 35 రోజుల పాటు సెక్స్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఆలయానికి చెప్పులు లేకుండా ఇప్పటికీ వేలాది మంది తరలివచ్చి తమ సెక్స్ కోరికలు తీర్చుకుని వెళుతుండటం గమనార్హం.