రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ 

ఆసియా‌కప్ మెగా టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ అద్వితీయ విజయాన్ని అందుకుంది
ఈ విజయంతో హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు
టీ20ల్లో 30 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. 
కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజీ 83.33తో అత్యధిక విజయ శాతం ఉన్న కెప్టెన్‌గా నిలిచాడు.
రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచుల్లో 83.33 విజయాల సగటుతో 30 మ్యాచ్‌లు గెలుపొందింది.
రోహిత్‌ సారధ్యంలో భారత్‌ కేవలం 6 మ్యాచుల్లో మాత్రమే ఓడింది.
ఈ జాబితాలో రోహిత్‌ తర్వాత స్థానంలో 80.8 శాతంతో ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్ఘాన్‌ ఉన్నాడు.
ఆ తరువాత టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (62.5%) వరుసగా ఉన్నారు.