రైస్ సైడ్ ఎఫెక్స్: రోజూ అన్నం తింటే శరీరంలో వచ్చే 4 మార్పులు ఇవే?
ఏ ఆహారం తిన్నా ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
ఏదైనా సరే మీతిమీరితే ఆరోగ్యం నశిస్తుంది. ఇందులో అన్నం కూడా ఒకటి.
బియ్యం హెల్త్‌కు మంచిదే. కానీ అధికంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజూ వైట్ రైస్ తినడం వల్ల శరీరంలో 4 రకాల మార్పులు వస్తాయని తాజాగా గ్రేటర్ నోయిడాలోని ఒక ఆసుపత్రిలో డైటీషియన్ ఆయుషి యాదవ్ వెల్లడించారు. అవేంటో చూద్దాం..
1. వైట్ రైస్‌లో గ్లైనమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీంతో రైస్ ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఫలితంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
2. ఇతర పోషక ఆహారాలతో పోలిస్తే వైట్ రైస్‌లో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అవసరమైన ఫైబర్స్, విటమిన్లు, మినరల్స్. పోషకాల లోపం ఎముకలు, దంతాలు అండ్ ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
అలాగే రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు. కాబట్టి బియ్యం బదులుగా జొన్న, బజ్రీ, గోధుమలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మేలు.
3. ఎక్కువగా రైస్ తింటే శరీరంలో తక్కువ కండరాలు, ఎక్కువ కొవ్వు ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడు పొట్ట స్లిమ్ గా కనిపించకుండా లూజ్‌గా కనిపిస్తుంది.
4. వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యను కలిగిస్తుంది.
కాగా రైస్‌కు బదులు ఫైబర్ అధికంగా ఉండే పప్పులు, కూరగాయలు, పనీర్, వేరుశెనగ, సలాడ్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకొండి.