ట్రాఫిక్‌లో ఎక్కువగా గడిపితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?

ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ట్రాఫిక్ ఎక్కువ సమయం గడిపితే సౌండ్ పొల్యూషన్ వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుందట.
ట్రాఫిక్ శబ్దంలో ఎక్కువగా ఉంటే అనారోగ్యానికి గురవడంతో పాటు 5 సంవత్సరాల్లో వారికి గుండె పోటు వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
శబ్ద కాలుష్యం వల్ల స్ట్రెస్ హార్మోన్లు అడ్రినలిన్, కార్టిసాల్ శరీరంలో రిలీజ్ అవుతుంది. అలాగే ధమనులు గట్టిపడి టాన్జిల్స్‌లో వాపు వస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అలాగే ట్రాఫిక్ సౌండ్స్ వల్ల రక్తపోటు, హార్ట్ ఎటాక్ రేటు పెరగడానికి కారణమవుతాయి.
ధ్వనిని డెసిబుల్స్‌లో కొలుస్తారట. పటాకులు పేల్చినప్పుడు వచ్చే సౌండ్స్ దాదాపు 140 డెసిబుల్స్ ఉంటుంది. ఆ సౌండ్ పెరిగేకొద్ది చెవిపై నెగిటివ్ ఎఫెక్ట్ పెరిగిపోతుందట.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ట్రాఫిక్ శబ్దం 53 DB కంటే ఎక్కువగా ఉంటుందని అది జనాల అనారోగ్యానికి హాని కలిగిస్తుందని తెలిపారు.
పలు మహానగరాల్లో చాలా మొయిన్ ఏరియాల్లో 45 DB శబ్ద కాలుష్యం కలిగి ఉంటుందని 35 DB కి మించిన శబ్దంలో ఎక్కువ సేపు గడిపితే 5 ఏళ్ల తర్వాత వారికి హార్ట్ ఎటాక్ ముప్పు తప్పదని అంటున్నారు.
కాబట్టి ఎక్కువ సేపు ట్రాఫిక్‌లో ఉండకుండా ఇంటికి చేరుకోవడంత మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.