వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వస్తే చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ మెసేజ్ చదివే ఆప్షన్ ఒకటి ఉంది.

దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
ఫోన్‌లో హోం స్క్రీన్ ‌పైన లాంగ్ ప్రెస్ చేస్తే, విడ్జెట్‌ కనిపిస్తుంది.
విడ్జెట్‌లో వాట్సప్‌ను ట్యాప్ చేసి హోమ్ పేజీలో యాడ్ చేయాలి.
అలా యాడ్ చేశాక, వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లు విడ్జెట్‌లో కనిపిస్తాయి.
నోటిఫికేషన్ ప్యానెల్‌లో కూడా మెసేజ్‌లు చదవచ్చు, కానీ ఫుల్ మెసేజ్ చదవడం కుదరదు
అదే హోం స్క్రీన్ విడ్జెట్‌లో అయితే చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ మొత్తం చదవచ్చు.
కొత్తగా మెసేజ్‌లు అన్ని కూడా వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే చూడొచ్చు.
ఈ చిన్న ట్రిక్ ద్వారా మీరు ప్రతిసారీ వాట్సాప్ చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.