మెగా హీరో రామ్ చరణ్ మార్చి 27న 1985లో చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు.

చిరంజీవి వారసుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో ‘మగధీర’ మూవీతో హిట్ కొట్టి ఫిలింఫేర్ అవార్డును పొంది తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
రామ్ చరణ్ తన చిన్నప్పటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి 2012లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.
2022లో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు.
2023 నాటికి హీరోగా 15 సినిమాల్లో నటించాడు.
చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.