పెట్ డాగ్స్ పెంచుకుంటున్నారా? అయితే కాన్సర్ ముప్పు తప్పదంటున్న నిపుణులు!

ప్రస్తుత రోజుల్లో డాగ్స్‌ను పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.
ఎంత ఖరీదైనా భరించి.. చాలా మంది పెట్ డాగ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. వాటిని జంతువుల్లా కాకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు యజమానులు.
పైగా వాటితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుని, నిత్యం ఆ డాగ్స్‌తోనే తినడం, పడుకోవడం చేస్తూ ఉంటారు.
అయితే ఈ డాగ్స్ వల్ల యజమానులకు రిస్క్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే ఈ డాగ్స్ వల్ల యజమానులకు రిస్క్ ఉంటుందని, క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కెమికల్స్, ప్లాస్టిక్ లాంటి మానవాళికి తీవ్రంగా నష్టం కలిగించే వస్తువులు డాగ్స్‌లో ఉన్నాయంటున్నారు.
అన్నీ పెట్ డాగ్స్, హార్స్‌లోని బ్లెడ్‌లో ఫరెవర్ కెమికల్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. డాగ్స్ రక్తంలోని ఫరెవర్ కెమికల్సైన పర్ మరియు పాలీఫ్లోరోఅల్కిల్ వల్ల జనాల్లో క్యాన్సర్ రావొచ్చని అంటున్నారు.
ఈ కెమికల్స్ బాడీలోకి చేరి లివర్, కిడ్నీ ఫంక్షన్స్‌ను దెబ్బతీస్తాయని, కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్, టెస్టిక్యులర్ క్యాన్సర్ లాంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.
దీంతో పెట్ డాగ్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.