విజృంభిస్తున్న డెంగ్యూ నుంచి మీ పిల్లల్ని ఇలా రక్షించుకోండి..!

రోజు రోజుకు డెంగ్యూ వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో.
ప్రస్తుత రోజుల్లో ఈ వ్యాధి.. గుండె, కిడ్నీ, మెదడు, కాలేయ, క్లోమం ఇలా అనేక రకాల అవయవాలు డెంగ్యూ బారిన పడుతున్నాయి.
కాగా చిన్నపిల్లల్లో డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించి.. చర్యలు తీసుకోవడం ఉత్తమం.
జ్వరం, వాంతులు, చర్మంపై దద్దుర్లు లాంటివి డెంగ్యూ ప్రధాన లక్షణాలు.
కాగా డెంగ్యూ దోమల నుంచి మీ పిల్లల్నీ కాపాడుకోవాలంటే ముందుగా మీ ఇంటి చుట్టన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు మ్యాట్ ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలకు నిండైన దుస్తులు వేయడం వల్ల డెంగ్యూ బారిన పడకుండా ఉండొచ్చు.
ఇంట్లో దోమల నివారణకు దూపం పెట్టుకోవాలి. పిల్లల్ని మైదానంలో ఆడుకోనివ్వకూడదు. ఒకవేళ ఆడినట్లైతే దోమల నివారణ క్రీమ్ రాయండి.