పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఈ పండ్లు కచ్చితంగా తినాల్సిందే?

ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో పిండం పెరుగుతున్న దశ కాబట్టి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యకరమైన ఆహారాలు ఎంచుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.
అందులో ముఖ్యంగా తల్లులు సరైన ఆహారం తీసుకోకుంటే బిడ్డ ఆరోగ్యంగా జన్మించదు కాబట్టి కడుపుతో ఉన్న సమయంలో నాణ్యమైన పోషకాహారాలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ పండ్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆపిల్స్‌లో విటమిన్ ఎ, పోటాషియం, ఫైబర్, పాలిఫినెలిక్ మిశ్రమాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మించడంతో పాటు తల్లి కూడా హెల్దీగా ఉంటుంది.
అలాగే విటమిన్లు, మినరల్స్, సమృద్ధిగా ఉండే అరటి పండ్లు గర్భిణీలు తప్పకుండా తినాలి. వీటి వల్ల రక్తహీనత తలెత్తకుండా శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరగడంతో పాటు గర్భధారణ సమయంలో తలెత్తే వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దానిమ్మలో ఫాలిఫినాల్, విటమిన్ కె, ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం గర్భిణీలు తినడం వల్ల శిశువు నాడుల సంరక్షణకు సహాయపడుతాయి.
గర్భిణీలు తీసుకునే పండ్లలో నారింజ ముందుంటుంది. నారింజ జ్యూస్ తాగితే రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. కడుపులో ఉన్న పిండం మెదడు అభివృద్ధిలో నారింజ దోహదపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్ కాగానే చాలా మంది మహిళలకు పుల్లటి మామికాయల తినాలనే కోరిక కలుగుతుంది. అయితే ఇందులో ఉండే విటమిన్లు, బిడ్డ ఆరోగ్యంగా జన్మించడానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
కాబట్టి ఈ పండ్లు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని నిపుణులు చెబుతున్నారు.