పోషకాల గని.. పొన్నగంటి కూర! ఆయుర్వేద నిపుణులు చెబుతుంది ఇదే..!!

ఆకు కూరలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఔషధ గుణాలు కలిగిన ఆకు కూరలో ఒకటి పొన్నగంటి కూర.
పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది.
ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూరను నలభై ఎనిమిది రోజులపాటు తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి.
ఇది కళ్లను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుంది.
పొన్నగంటి కూర‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్, జింక్ ల‌తోపాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ ఆకు కూర‌ను త‌ర‌చూ తింటే చాలా మంచిది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.
పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.
నోట్ : ఈ కథనం ఇంటర్నెట్‌లో దొరికిన వివిధ నిపుణులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని ‘దిశ’ ధ్రువీకరించడం లేదని గ్రహించాలి.