టూత్ పేస్ట్‌తో మొటిమలు తగ్గుతాయా..! స్కిన్ స్పెషలిస్ట్ ఏం చెబుతున్నారంటే..?

పెరుగుతున్న ఎండలు, పొల్యుషన్ కారణంగా చాలా మంది మొఖంపై పింపుల్స్‌తో బాధపడుతుంటారు.
మొటిమలను పోగొట్టుకునేందుకు చాలా మంది అనేక రకాల చిట్కాలు, ఖరీదైన ప్రొడక్ట్స్ వాడతారు.
ఈ క్రమంలోనే చాలా మంది మొటిమలను పోగొట్టుకునేందుకు ఇంట్లో ఉండే టూత్ పేస్ట్‌ని ఉపయోగిస్తారు.
టూత్ పేస్టులో ఉండే బేకింగ్ సోడా, ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కొన్ని పదార్థాలు చర్మాన్ని డ్రైగా మారుస్తాయి. దీని వల్ల మొటిమలు తగ్గినప్పటికీ ఇది వాడటం ప్రమాదకరమని స్కిన్ స్పెషలిస్ట్ చెబుతున్నారు.
టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా, ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి అనేక కెమికల్స్ ఉంటాయి. ఇవి మొటిమలను తాత్కాలికంగా తగ్గించినప్పటికీ మళ్లీ ఎక్కువ అయ్యేలా చేస్తాయి.
టూత్‌పేస్ట్ అనేది దంతాలకి మాత్రమే ఉపయోగించేది. ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పేస్ట్‌లో ఉండే ఇందులోని కెమికల్స్ మీ దంతాలకు మంచిది కానీ, చర్మానికి అంత సురక్షితం కాదు.
అంతే కాకుండా టూత్ పేస్ట్ రాసిన చోట మరకలు ఎక్కువగా ఉంటాయి.
అయితే మీరు ఇంటి చిట్కాలతో మొటిమలని దూరం చేయాలనుకుంటే ముల్తానీ మట్టి, అలోవెరా జెల్, వేప ఆకులు, పసుపు, తేనె, నిమ్మరసం, రోజ్ వాటర్, పిప్పర్‌మెంట్ రాయొచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
నోట్: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యం, చర్మ సమస్యలు ఏవి వచ్చినప్పటికి వైద్యులను సంప్రదించడం మంచిది. వారి సలహా మేరకు మీరు ఏదైనా ప్రొడక్ట్ ఉపయోగించవచ్చు.