ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లు అస్సలు తినకూడదు..

ఎండాకాలం మార్కెట్‌లో ఎక్కువుగా అందుబాటులో ఉండే నేరేడు పండ్లు ఎంతో రుచికరంగా ఉంటాయి కాబట్టి చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
ఇవి వగరుగా ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలో మార్పులు ఏర్పడతాయి.
నేరేడు పండ్లు అధికంగా తింటే శ్వాస సమస్యలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మలబద్ధకంతో బాధ పడేవారు ఈ పండ్లను తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
కొంత మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. ఇలాంటి నేరేడు పండ్లు తింటే మొటిమలు తలెత్తి ఇబ్బందులకు గురవుతారు.
ఈ పండ్లు తిన్న తర్వాత కొంత మందికి వికారం, వాంతి వంటి వాటిని ఎదుర్కొంటారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నేరేడు కు దూరంగా ఉండాలి.
చర్మ సమస్యలు వేధిస్తున్న వారికి నేరేడు వినియోగం వల్ల అలెర్జీలు ఎక్కువవుతాయి.
బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు నేరేడు తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు కడుపునొప్పి వచ్చేలా చేస్తాయి.