ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుడ్లు తింటే డేంజర్‌లో పడ్డట్లే..!

ఆరోగ్యానికి మంచిదని చిన్నా పెద్ద ప్రతి రోజు కనీసం ఒక్కటైనా తింటుంటారు. కొందరైతే భోజనంలో గుడ్డు లేకుండా అన్నం కూడా ముట్టరు.
కోడి గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఎందుకంటే గుడ్డు చాలా నెమ్మదిగా డైజేషన్ అవుతుంది. అలాగే జీర్ణ సమస్యను మరింత పెంచుతుంది.
అలాగే చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డును తింటే చాలా ప్రమాదం. కాబట్టి డాక్టర్లను సంప్రదించి గుడ్డులోని లోపలిది తినకుండా వైట్‌ది తినవచ్చును.
ఇటీవల కాలంలో చాలా మంది గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారు గుడ్డు తింటే రక్త ప్రసరణ‌లో ఇబ్బంది కలిగి హార్ట్ ఎటాక్ వస్తుంది.
డయేరియా సమస్య ఉంటే గుడ్డు తినడం వల్ల ఆ సమస్య మరింత పెరిగి ప్రమాదానికి దారి తీయవచ్చును. అంతేకాకుండా కడుపు నొప్పిని కూడా పెంచుతుంది.