లోబీపీతో బాధపడేవారు.. ఈ టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే?

సాధారణంగా హైబీపీ, లోబీపీ అనేది చాలా మందిలో సర్వసాధారణంగా ఉంటుంది.
అయితే ముఖ్యంగా ఎండాకాలం చాలా మందికి లోబీపీ సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ఈ టిప్స్ తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
లోబీపీ ఉన్నవారు శరీరం డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ప్రతిరోజూ 3 లీటర్ల నీరు తాగడం మంచిది.
కాఫీ తాగితే లోబీపీ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగని మోతాదుకు మించి తాగకూడదు.
తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల లోబీపీ సమస్య తగ్గుతుంది.
బాదం పాలను రోజూ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ పడిపోకుండా ఉంటుంది.
రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్షలను మీ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.