స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక గుర్తించుకోండి.

సాధారణంగా కొంతమందికి స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది.
మూత్రం తేలికగా ఉంటే ఆరోగ్యం కూడా మంచిది. కాగా స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం సరైనదా?కాదా? అనేది చాలామందిలో తలెత్తే ప్రశ్న.
కాగా మూత్రం వాస్తవానికి ఆరోగ్యకరమైనదని తాజాగా పరిశోధకులు వెల్లడించారు.
శరీరం నుంచి బయటకు వచ్చే యూరిన్‌లో ఎలక్ట్రోలైట్స్, యూరియా వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.
ఇందులో బ్యాక్టీరియా కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంపై మూత్ర విసర్జన చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు.
చర్మ రక్షణ కోసం సౌందర్య సాధనాల్లో యూరియాను కలుపుతారు. కాబట్టి సహజంగా యూరియా ఉన్న మూత్రం అందానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
కొంతమంది తమ చర్మం అందంగా మెరవడానికి మూత్రాన్ని కూడా తాగుతుంటారంటున్నారు.
అథ్లెట్లు వారి పాదాల నుంచి ఫంగస్‌ను తొలగించడానికి యూరిన్ థెరపీ రూపంలో తమ పాదాలను మూత్రంతో స్నానం చేస్తుంటారట.