వర్షాకాలంలో హెయిర్‌కు ఆయిల్ పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?

వర్షాకాలంలో వాతావరణం తేమగా, చల్లగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యాన్నే కాదు జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి ఈ సీజన్‌లో హెయిర్‌కు నూనే రాయడం మంచిది. ఇది జుట్టును స్ట్రాంగ్‌గా, హెల్తీగా మార్చడంతో తోడ్పడుతుంది.
అలాగే చుండ్రు, ఇతర సమస్యలు తొలగిపోయి.. హెయిర్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల మీ హెయిర్‌లోని సహజ నూనెలు తగ్గిపోతాయి. దీంతో గాలిలోని తేమ జుట్టును దెబ్బతిస్తుంది. కాబట్టి ఆయిల్ పెడితే ఈ ప్రబ్లమ్ ఉండదు.
అలాగే హెయిర్ స్టైల్ చేయించుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది.
వాన కాలంలో కనీసం వారానికి 2సార్లు జుట్టుకు ఆయిల్ రాయడం వల్ల మీ హెయిర్ చిట్లిపోకుండా ఉంటుంది.
నూనెను గోరు వెచ్చగా చేసి హెయిర్ మూలాల నుంచి చివర్ల వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి.