పొట్లకాయ చూడటానికి సన్నగా పొడుగ్గా ఉంటుంది. కానీ దీని పొట్టనిండా ప్రొటీన్లే ఉంటాయి.
వేడి శరీరం ఉన్న వాళ్లు దీనిని తరచూగా ఆహారంగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి కడుపును చల్లబరిస్తుంది.
గుండెజబ్బులతో బాధపడేవాళ్లకి పొట్లకాయ ఔషధంగా పని చేస్తుంది. దీనిని తరచూ తినడం వల్ల గుండె దడ తగ్గడంతోపాటు గుండెనొప్పి తీవ్రతను తగ్గుస్తుంది.
జ్వరం వచ్చిన వారికి పొట్లకాయ కూర కలిపి అన్నం పెట్టండి. పొట్లకాయని సన్నగా తరిగి పెరుగు కలిపి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం కలిపి ఓ కప్పులో పెట్టి తినమనండి. జ్వరం తీవ్రత తగ్గుతుంది.
శరీరంలో ఏ కారణం చేతనైనా నీటి శాతం తగ్గిపోనప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. పొట్లకాయతో ఏదైనా ఒక రుచికరమైన ఆహార పదార్దం చేసి తినిపిస్తే డీహైడ్రేషన్ త్వరగా తగ్గుతుంది.
యాంటీబయోటిక్స్ అధికంగా వాడవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు, వాటితోపాటు పొట్లకాయని ఆహారంగా తీసుకోండి. అది కూడా మెడిసిన్‌లా పని చేస్తుంది.