వర్షాకాలంలో షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇవి తప్పక తీసుకోవాల్సిందే?
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచంలో 442 మిలియన్ల మంది డయాబెటిస్ బారిన పడ్డారు.
షుగర్ వ్యాధిని శాశ్వతంగా తగ్గించలేం కానీ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోగలం. అయితే షుగర్ పేషెంట్స్ వర్షాకాలంలో కొన్ని రకాల ఫ్రూట్స్ తింటే చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అందుకోసం వర్షాకాలం చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండాలంటే ఈ పండ్లు తీసుకోండి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బొప్పాయి షుగర్ పేషెంట్లకు బెస్ట్ ఫ్రూట్. USDA ప్రకారం, ఒక కప్పు బొప్పాయిలో 11 గ్రాముల చక్కెర ఉంటుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 60 ఉంది. ఇది రక్తంలో చక్కెరను త్వరగా పెంచదు.
అలాగే నేరేడు పండ్లు డయాబెటిస్‌ను తగ్గించే ఔషధ గుణాలు వీటిలో మెండుగా ఉంటాయి.
షుగర్ పెషేంట్స్ వారి డైట్‌లో అవకాడోను యాడ్ చేసుకుంటే చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండడమే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
విటమిన్ ఎ, సి వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే జామకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను బాగా తగ్గించగలదు.
వర్షాకాలంలో ఎక్కువగా దొరికే బత్తాయి షుగర్ పేషెంట్స్, వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే పియర్స్ పండ్లు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉత్తమమైనది.
ఆల్‌బక్రాలోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఎఫెక్టివ్‌గా తగ్గిస్తాయి.
అలాగే చెర్రీస్.. వర్షాకాలంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.